బుమ్రా వివాహం.. వధువు ఆమెనే - jasprit bumrah marries sanjana ganeshan shares pics on instagram
close
Updated : 15/03/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుమ్రా వివాహం.. వధువు ఆమెనే

(Photo:Bumrah Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వివాహంపై కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి సోమవారం తెరపడింది. ఓ క్రీడాఛానెల్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజనా గణేశన్‌ను అతడు వివాహమాడాడు. అందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు వ్యక్తిగత కారణాలతో బుమ్రా సెలవులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచీ అతడి వివాహ ముచ్చట్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. సంజన పేరు తెరపైకి వచ్చినా ఇరువురి నుంచీ ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఈ నేపథ్యంలోనే బుమ్రా అత్యంత గోప్యంగా ఈ విషయాన్ని దాచిపెట్టి సోమవారం గోవాలో తన ప్రియసఖితో ఏడడుగులు వేశాడు.

‘ప్రేమ.. అది మిమ్మల్ని వెతుక్కొని వస్తే ఎంతో విలువైనది. మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. మేం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఈరోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం’ అని బుమ్రా సంజనను వివాహమాడిన ఫొటోలను పోస్టు చేశాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని