Jasprit Bumrah: బుమ్రా = లాంబోర్గిని - jasprit bumrahs worth in team india is what wasim and waqars was for pakistan says salman butt
close
Published : 28/05/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jasprit Bumrah: బుమ్రా = లాంబోర్గిని

సల్మాన్‌ భట్‌ విచిత్రమైన విశ్లేషణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా విలువైన ఆటగాడని పాక్‌ మాజీ క్రికెటర్‌ సల్మాన్ భట్‌ అన్నాడు. అతడిని అత్యంత ఖరీదైన ఫెరారీ, లాంబోర్గిని వంటి కార్లతో పోల్చాడు. సరైన పరిస్థితుల్లోనే బుమ్రాను ఉపయోగించుకోవాలని సూచించాడు.  వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌లు పాక్‌ జట్టుకు తీసుకొచ్చిన విలువనే బుమ్రా టీమ్‌ఇండియాకు తీసుకొస్తున్నాడని ప్రశంసించాడు.

‘సులువుగా చెప్పాలంటే  బుమ్రా టయోటా లేదా కరోలా కాదు. అతడి లాంటి బౌలర్లకు ఫెరారీ, లాంబోర్గిని కార్లకు ఉన్న సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే అవి ప్రత్యేకమైన కార్లు. అందుకే అలాంటి సత్తాగల బౌలర్లను జట్లు సమయోచితంగా ఉపయోగించుకోవాలి. సరైన పరిస్థితుల్లోనే బౌలింగ్‌కు దించాలి. అలా చేస్తేనే వారి కాలపరిమితి పెరుగుతుంది. విలువైన మ్యాచుల్లో వారిని వాడుకుంటే మంచి ఫలితాలను ఇస్తారు. ఇప్పుడు బుమ్రా ఎంతో ప్రత్యేకం’ అని భట్ అన్నాడు.

‘కెప్టెన్లు కోరుకొనే బౌలర్‌ బుమ్రా. ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ను మీరు గమనిస్తే ఆట ఆరంభంలో బుమ్రాతో ఒక ఓవరే వేయిస్తాడు. ఆ తర్వాత ఆఖరి ఆరు ఓవర్లకు అతడిని అట్టిపెడతాడు. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు 30-40 పరుగులు చేయాలనుకొనే దశలో బుమ్రా పరుగులు నియంత్రించి వికెట్లు తీయగలడు. పాక్‌లో అక్రమ్‌, వకార్‌కు ఉన్న విలువ భారత జట్టులో బుమ్రాకు ఉంది.  మ్యాచ్‌ విజేతలు కావడమే వారి ప్రత్యేకత. పేసుగుర్రం నాణ్యమైన బౌలర్‌. అతడి డాట్‌ బాల్‌ పర్సంటేజ్‌ గొప్పగా ఉంటుంది. కచ్చితమైన నియంత్రణతో బౌన్సర్లు సంధిస్తాడు. అతడు జట్టుకు, కెప్టెన్‌కు విలువైన ఆస్తి’ అని భట్‌ తెలిపాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని