‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్‌ - jathi ratnalu pre release naveen polishetty vijay deverakonda
close
Published : 07/03/2021 22:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: ‘జాతి రత్నాలు’ సినిమా అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని, అందరూ థియేటర్లలో చూడాలని రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ అన్నాడు. నవీన్‌ పొలిశెట్టి, ఫారియా అబ్దుల్లా జంటగా నటించారు. అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. రాధన్‌ స్వరాలు సమకూర్చారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హన్మకొండలో ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్‌దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘ఏడాది పాటు థియేటర్లు మూతపడి ఉంటే మేమంతా ఎంతో భయపడ్డాం. కానీ.. మీరు ఆ భయాలన్నీ తొలిగిపోయేలా చేశారు. థియేటర్లు తెరవగానే ఇన్ని సినిమాలు విడుదలవడం, ఇన్ని హిట్లు రావడం మన దగ్గర తప్ప మరెక్కడా లేదు. తెలుగు ప్రేక్షకులను మించిన వాళ్లు లేరు. ‘జాతి రత్నాలు’ గురించి చెప్పాలంటే.. వీళ్లంతా నా కుటుంబ సభ్యుల్లాంటివాళ్లు. నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌.. మేమంతా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. ఇది మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మార్చి 11న థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి’ అని విజయ్‌ అన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని