నవ్వులు పంచుతున్న ‘జాతిరత్నాలు’ టీజర్‌ - jathi ratnalu teaser
close
Updated : 12/02/2021 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వులు పంచుతున్న ‘జాతిరత్నాలు’ టీజర్‌

హైదరాబాద్‌: నవీన్‌ పోలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్‌ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా టీజర్‌ శుక్రవారం విడుదలైంది. ముగ్గురు యువకుల జీవితంలో ‘లైఫ్‌ అండ్‌ డెత్‌’ పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటి? దాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? చివరకు ఆ సమస్య నుంచి బయట పడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అప్పటివరకూ ఆసక్తికరంగా, నవ్వులు పంచుతూ సాగిన ఈ టీజర్‌ను మీరూ చూసేయండి. స్వప్న సినిమాస్‌ పతకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్నారు. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 11న ‘జాతి రత్నాలు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని