‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం? - jayam ravi to nexy movie with viswasam co-writer antony
close
Updated : 05/04/2021 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?

ఇంటర్నెట్‌ డెస్క్: ‘బావ బావమరిది’, ‘పల్నాటి పౌరుషం’ వంటి  తెలుగులో చిత్రాల్లో బాలనటుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయం రవి. ఆ తర్వాత తమిళంలో ‘జయం’ రీమేక్‌ చిత్రంలో కథానాయకుడిగా నటించి అలరించారు. తాజాగా ఆయన ‘విశ్వాసం’ చిత్ర సహ-రచయిత అయిన ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలొస్తున్నాయి. ఆంటోనీ చెప్పిన కథ నచ్చడంతో జయం రవి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడట. సినిమాని జులైలో ప్రారంభించే యోచనలో ఉన్నారట. ఇందులో జయం రవి కొత్త గెటప్‌లో కనిపించనున్నారట. సినిమాకి సంబంధించిన తారాగణం, సాంకేతిక సిబ్బంది మొత్తం ఖరారైన తర్వాత ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన చేయనునున్నారని సమాచారం. ప్రస్తుతం జయం రవి - మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కతున్న భారీ చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో రాజరాజచోళన్‌గా నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని