ముద్దడిగిన అభిమాని.. జాన్వీ ఫన్నీ రిప్లై! - jhanvi kapoor chit chat with fans in instagram
close
Updated : 23/03/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముద్దడిగిన అభిమాని.. జాన్వీ ఫన్నీ రిప్లై!

జాన్వీ కపూర్‌.. మన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు... యాక్టింగ్‌ సంగతి పక్కన పెడితే నిజ జీవితంలో మహా చురుకు... ఇటీవల ‘రూహీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటించింది... వాళ్లు అడిగిన ప్రశ్నలకు తెలివిగా.. సరదాగా.. కొంటెగా సమాధానాలిచ్చింది. కొన్ని ఆసక్తికర సంగతులూ చెప్పింది.  ఆ చిట్‌చాట్‌ సంగతులు ఫటాఫట్‌ మనమూ తెలుసుకుందాం.

మీరు స్టార్‌ నిర్మాత కూతురు, మేటి నటికి వారసురాలు కదా. పరిశ్రమలో మీ స్థానం ఏంటి?

జాన్వీ: నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నటిని. నాకెలాంటి హోదాలు వద్దు. నాకే గర్వం లేదు. లైట్‌బాయ్‌ నుంచి డైరెక్టర్‌ దాకా అందరికీ నచ్చేలా ఉండాలనుకుంటా.

మనం కిస్‌ చేసుకుందామా?

జాన్వీ: ‘నో’. ఇది అంత శ్రేయస్కరమైన పని కాదు (మాస్కు పెట్టుకున్న తన ఫొటో చూపిస్తూ)

రెగ్యులర్‌గా మీరు తినే డైట్‌ ఏంటో చెబుతారా ప్లీజ్‌..

జాన్వీ: ఏం తిన్నా, తినకపోయినా ఇది మాత్రం రోజుకి నాలుగు చెంచాలు (చేతిలో ఓ ఐస్‌క్రీం పట్టుకొని)

మీ జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం?

జాన్వీ: కొన్నేళ్ల కిందట అమ్మానాన్నలతో కలిసి ఫ్రాన్స్‌ వెళ్లాను. అక్కడ దక్షిణ ఫ్రాన్స్‌లో లాంగ్‌ రోడ్‌ ట్రిప్‌ వెళ్లాం. అది స్వీట్‌ మెమొరీ.

మీ ఫేవరెట్‌ కో-స్టార్‌ ఎవరు?

జాన్వీ: ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’లో నేను కలిసి నటించిన పంకజ్‌ త్రిపాఠి.

ఆత్రుత, మానసిక ఒత్తిడి.. తప్పించుకోవడానికి ఏం చేస్తుంటారు?

జాన్వీ: దిండుని కౌగిలించుకొని కొన్ని విషాద గీతాలు పాడుకుంటా.

ఎక్కడికెళ్తున్నా కెమెరాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయ్‌ కదా.. మీకు ఇబ్బందిగా అనిపిస్తోంది?

జాన్వీ: ఇందులో ఇబ్బంది ఏముంది? వాళ్లు మనకు ప్రచారం కల్పిస్తున్నారు. పైగా వాళ్ల వృత్తిని గౌరవించాలి కదా!

మీ ఫస్ట్‌ క్రిటిక్‌  ఎవరు?

జాన్వీ: మా చెల్లి ఖుషీ. తను ఏ విషయమైనా నిర్మొహమాటంగా చెబుతుంది. సినిమాలైనా, వ్యక్తిగత విషయాలైనా. అక్కనే కదా అని ఎప్పుడూ ఆకాశానికి ఎత్తేయదు.

మీ గురించి ఏవైనా రూమర్లు వస్తే ఎలా ఫీలవుతారు?

జాన్వీ: నాకేం ఇబ్బంది లేదు. కానీ మా ఫ్యామిలీ బాధ పడతారు అనే ఆలోచనంతా. అయినా అలాంటి వాటిపై ప్రతి స్పందించడం కూడా అనవసరం అనిపిస్తుంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని