స్నేహితుడి కోసం 1,300 కి.మీ ప్రయాణం - jharkhand man travels 1300 kms in 24 hours to bring oxygen to covid positive friend
close
Updated : 29/04/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్నేహితుడి కోసం 1,300 కి.మీ ప్రయాణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనాతో పోరాడుతున్న తన స్నేహితుడికి ఆక్సిజన్‌ అందించడానికి ఒక్క రోజులో వందల కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ వ్యక్తి. రాంచీకి చెందిన దేవేంద్ర 24 గంటల్లో రాంచి నుంచి ఘజియాబాద్‌కు 1,300 కి.మీ ప్రయాణించి తన స్నేహితుడికి ఆక్సిజన్‌ సిలిండర్లను అందజేశాడు. అతడు చేసిన ఈ సాహసానికి అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన సంజయ్‌ సక్సేనాకు కరోనా సోకడంతో ఆక్సిజన్‌ అవసరమైంది. అతని వద్ద 24 గంటలకు సరిపడే ఆక్సిజన్‌ మాత్రమే ఉంది. ఆక్సిజన్‌ కొరత ఉండటం వల్ల సక్సేనా కుటుంబ సభ్యులు ఆక్సిజన్‌ సిలిండర్లను సంపాదించలేకపోయారు. సక్సేనా ఏప్రిల్‌ 24న రాంచీలో ఉన్న తన స్నేహితుడు దేవేంద్ర కుమార్‌ శర్మ ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలని కోరాడు. అడిగిందే తడవుగా దేవేంద్ర ఝార్ఖండ్‌ గ్యాస్‌ ప్లాంట్‌ యజమాని రాకేశ్ కుమార్‌ గుప్తాను సంప్రదించాడు. గుప్తా ఆక్సిజన్‌ సిలిండర్‌లను ఉచితంగా అందించాడు. వాటిని తీసుకుని అద్దె కారులో రాంచీ నుంచి బయలు దేరి 24 గంటల్లో 1,300 కిలోమీటర్లు ప్రయాణించి తన స్నేహితుడిని చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో బిహార్‌, యూపీలో పోలీసులు తనిఖీ తన మిత్రుడికోసం వాటిని కోసం తీసుకెళ్తున్నానని చెప్పడంతో పోలీసులు తన ప్రయాణానికి అనుమతి ఇచ్చారని దేవేంద్ర తెలిపాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని