శాస్త్రాన్ని మనిషి ఎదిరిస్తే..? - jiivi telugu trailer etri monica chinnakotla v.j gopinath premieres june 25
close
Published : 23/06/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శాస్త్రాన్ని మనిషి ఎదిరిస్తే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఒకే రకమైన సంఘటనలు వేర్వేరు కుటుంబాల్లో వేర్వేరు కాలాల్లో జరిగితే..? కీడు జరగబోతోందని తెలిసిన హీరో అది కొనసాగకుండా ఆ చైన్‌ను ఎలా బ్రేక్‌ చేశాడు..? ఈ క్రమంలో పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? ఇలాంటి ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘జీవి’. వి.జె.గోపీనాథ్‌ దర్శకత్వం వహించారు. వెట్రి, మోనిక కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసారదారు సంస్థ చిత్ర ట్రైలర్‌ను పంచుకుంది. ఈ ట్రైలర్‌లో సారూప్య సంఘటన శాస్త్రం గురించి హీరో వివరిస్తూ.. దాని వల్ల జరిగే పరిణామాలు.. దాన్ని అడ్డుకోవడం ఎలా అనేది తెలియజేస్తూ చెప్పే సంభాషణ ఆకట్టుకునేలా ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని