Jio Laptop: మరోసారి వార్తల్లో జియో ల్యాప్‌టాప్‌.. ఈసారి ఫొటోతో  - jio soon launch its latop called jio book in india
close
Published : 14/09/2021 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jio Laptop: మరోసారి వార్తల్లో జియో ల్యాప్‌టాప్‌.. ఈసారి ఫొటోతో 

ఇంటర్నెట్‌డెస్క్‌: తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్స్‌తో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు గూగుల్‌తో కలిసి జియో స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం జరిగిన రిలయన్స్‌ ఏజీఎం సమావేశంలో కంపెనీ ప్రకటించింది. అయితే ఈ కొత్త ఫోన్‌ను వినాయకచవితికి విడుదల చేస్తారని తొలుత భావించినప్పటికీ దీపావళికి తీసుకొస్తున్నట్లు జియో తెలిపింది. అలానే రిలయన్స్ ఏజీఎం సమావేశంలోనే జియో ల్యాప్‌టాప్‌పై ప్రకటన చేస్తారని ఆశించినప్పటికీ దానికి సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా జియో ల్యాప్‌టాప్‌కు సంబంధించిన వివరాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. జియో బుక్‌ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తున్నారని సమాచారం. రిలయన్స్‌ కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌ మోడల్‌కు సంబంధించి ధ్రువీకరణ కోసం బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌)కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. బీఐఎస్‌ నుంచి అనుమతి పొందిన వెంటనే జియో బుక్‌ను మార్కెట్లోకి విడుదలచేస్తారని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఎలాంటి ఫీచర్లతో జియో బుక్ ల్యాప్‌టాప్‌లు రానున్నాయనేది చూద్దాం. 

జియో బుక్‌ ల్యాప్‌టాప్

ఈ ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల హెడీ డిస్‌ప్లే ఇస్తారట. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌, స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌12 4జీ మోడెమ్‌ ఉపయోగించారని తెలుస్తోంది. 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్‌ ర్యామ్‌/64జీబీ ఈఎమ్‌ఎమ్‌సీ స్టోరేజ్‌ ఇస్తున్నారట. మినీ హెచ్‌డీఎమ్‌ఐ కనెక్టర్‌, డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, త్రీ యాక్సిస్ యాక్సిలెరోమీటర్, క్వాల్‌కోమ్‌ ఆడియో చిప్‌ వంటి ఫీచర్స్ ఇస్తున్నారని సమాచారం. జియో స్టోర్, జిమో మీట్, జియో పేజెస్ , జియో బుక్‌ వంటి యాప్స్‌తోపాటు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్‌లను ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ ల్యాప్‌టాప్‌ ఎప్పుడు విడుదల చేస్తారు.. ధరెంత వంటి వివరాలకు తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని