కరోనా టీకా రెండో డోసు తీసుకున్న బైడెన్‌ - joe biden received second dose of corona vaccine
close
Updated : 12/01/2021 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టీకా రెండో డోసు తీసుకున్న బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. 78 ఏళ్ల జో బైడెన్‌ 2020 డిసెంబర్‌ 21న ఫైజర్‌ టీకా తొలి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. బైడెన్‌ టీకా తీసుకున్న ఈ ఘట్టాన్ని ఆ సమయంలో అమెరికా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రజల్లో వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను పోగొట్టేందుకే బహిరంగంగా టీకా తీసుకున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఇప్పడు తాజాగా మరోసారి టీకా రెండో డోసు తీసుకున్నారు. ఎవరైనా కరోనా టీకా తొలి డోసు తీసుకున్నాక.. రెండు డోసును తీసుకోవాల్సిందే. ఇందులో భాగంగానే బైడెన్‌  కొవిడ్‌ టీకాను మరోసారి తీసుకున్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. రెండో సారి టీకా తీసుకుంటున్న సందర్భంలో కాస్త ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందించడమే తన ప్రథమ కర్తవ్యమని బైడెన్‌ పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు అమెరికాలో 2,23,85,975 మంది కరోనా బారిన పడగా, 3,74,072 మంది చనిపోయారు. అమెరికాలో కొద్దిరోజుల క్రితం నెమ్మదించిన కరోనా కేసులు మళ్లీ ఇటీవల పెరుగుతుండడం తెలిసిందే. అంతేకాకుండా కొత్తరకం స్ట్రెయిన్‌ కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో తీవ్ర అలజడి నెలకొంది. 

ఇదీ చదవండి 
ట్రంప్‌పై అభిశంసన తీర్మానం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని