ఆర్చర్‌ చేతికి శస్త్రచికిత్స - jofra archer to undergo hand surgery on monday
close
Published : 27/03/2021 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్చర్‌ చేతికి శస్త్రచికిత్స

పుణె: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌కు సోమవారం శస్త్రచికిత్స జరగనుంది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌కు అతడు  అందుబాటులో లేని సంగతి తెలిసిందే.

ఆర్చర్‌ కోహ్లీసేనతో రెండు టెస్టులు, ఐదు టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 4, పొట్టి క్రికెట్లో 7 వికెట్లు తీశాడు. నిజానికి భారత పర్యటనకు ముందే అతడి చేతికి గాయమైంది. ఈసీబీ వైద్య బృందం పర్యవేక్షించడంతో అతడు క్రికెట్‌ ఆడగలిగాడు.

టీ20ల తర్వాత ఆర్చర్‌ కుడి మోచేతికీ గాయం కావడంతో వన్డేలకు విశ్రాంతినిచ్చారు. మంగళవారమే బ్రిటన్‌కు చేరుకున్న అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్‌ తీసిన తర్వాత నిపుణులు ఆర్చర్‌కు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీర్ఘ కాలికంగా ఆలోచిస్తే శస్త్రచికిత్సే మంచిదని వారు పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని