ఎవరైనా బ్యాట్‌ను రిపేర్‌ చేసేవారు ఉన్నారా?  - jofra archers three years old tweet went viral after his bat broken in the fourth t20 vs india
close
Published : 19/03/2021 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరైనా బ్యాట్‌ను రిపేర్‌ చేసేవారు ఉన్నారా? 

ఆర్చర్‌ మూడేళ్ల కిందటి ట్వీట్‌ వైరల్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా ఉత్కంఠ పరిస్థితుల్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివర్లో ఇంగ్లాండ్ పేస్‌ బౌలర్‌ జోఫ్రాఆర్చర్‌(18; 8 బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆడి భారత శిబిరంలో కాస్త ఆందోళన కలిగించాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అతడి బ్యాట్‌ విరిగింది. అయితే, ఇప్పుడా విషయం ఆన్‌లైన్‌లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే మూడేళ్ల క్రితం అతడు చేసిన ఓ ట్వీటే అందుకు కారణం. 2018 మార్చి 7న ఆర్చర్‌ ఓ ట్వీట్‌ చేస్తూ ‘ఇంగ్లాండ్‌లో ఎవరైనా బ్యాట్‌ను మంచిగా రిపేర్‌ చేసేవాళ్లు ఉన్నారా?’ అని పేర్కొన్నాడు. తాజాగా నాలుగో టీ20లో అతడి బ్యాట్‌ విరగడంతో ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు భారత విజయం తేలికే అనిపించింది. కానీ, శార్ధూల్‌ వేసిన ఆ ఓవర్‌లో జోర్డాన్‌(12) తొలి బంతికి సింగిల్‌ తీసిచ్చాడు. తర్వాత ఆర్చర్‌.. రెండు, మూడు బంతులను 4, 6గా మలిచాడు. దాంతో భారత శిబిరంలో కలవరం రేపాడు. ఆపై శార్ధూల్‌ వరుసగా రెండు వైడ్లు వేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. సమీకరణం 3 బంతుల్లో 10 పరుగులకు మారింది. అలాంటి స్థితిలోనే ఆర్చర్‌ నాలుగో బంతిని ఎదుర్కోగా బ్యాట్‌ విరిగింది. అతడు సింగిల్‌ తీశాడు. అయిదో బంతికి జోర్డాన్‌ ఔటయ్యాడు. చివరి బంతికి ఆర్చర్‌ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దాంతో టీమ్‌ఇండియా విజయం సాధించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని