Satyameva Jayate 2: ‘సత్యమేవ జయతే2’.. హైవోల్టేజ్‌ యాక్షన్‌ హంగామా! - john abraham satyameva jayate 2 trailer out
close
Updated : 26/10/2021 09:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Satyameva Jayate 2: ‘సత్యమేవ జయతే2’.. హైవోల్టేజ్‌ యాక్షన్‌ హంగామా!

జాన్‌ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని జాన్‌ అబ్రహం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తాజాగా  చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మాస్‌ను ఆకట్టుకునేలా ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘ఈ ప్రపంచం ఓ యుద్ధక్షేత్రం. మీ అన్నదమ్ములిద్దరూ కొట్టుకుంటే చూడాలని ప్రజలు ఎదురు చూస్తుంటారు. మీరిద్దరూ గొడవపడితే శత్రువు విజయం సాధిస్తాడు’ అంటూ చెబుతున్న సంభాషణలు ఆకట్టుకుంటన్నాయి. మరి సత్య, జై కలిసి కలిసి పోరాటం చేశారా? లేక వీరిద్దరూ ఒకరితో ఒకరు కలబడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెట్టింపు యాక్షన్‌, వినోదంతో నవంబరు 25న థియేటర్లకు రానుంది. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కూమార్‌ ఓ కీలక పాత్రలో నటించింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని