కరోనా మృతుడిఅంత్యక్రియలకు గుంటూరు జేసీ - joint collector attend corona patient cermony in guntur
close
Published : 02/08/2020 23:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా మృతుడిఅంత్యక్రియలకు గుంటూరు జేసీ

ప్రజలకు భరోసా ఇచ్చేందుకు హాజరు

గుంటూరు: కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ పాల్గొన్నారు. బాధితుల అంత్యక్రియల నిర్వహణలో అపోహలను తొలగించేందుకు వినూత్నంగా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. చనిపోయిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగనివ్వాలని సూచించారు. మృతదేహాన్ని హైపోక్లోరైడ్‌తో రుద్ది, ప్యాక్‌ చేసి అందిస్తామని పేర్కొన్నారు. మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటిస్తూ అంత్యక్రియల్లో పాల్గొంటే వైరస్‌ సోకదని తెలిపారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని తాకినా వైరస్‌ సోకదని వివరించారు. మృతదేహాల అంత్యక్రియలకు మూడు శ్మశాన వాటికలను గుర్తించామని వెల్లడించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని