తారక్‌ గ్యారేజ్‌లో లంబోర్గినీ..! - jr ntr buys lamborghini car
close
Updated : 04/03/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తారక్‌ గ్యారేజ్‌లో లంబోర్గినీ..!

హైదరాబాద్: టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కార్ల కలెక్షన్‌లోకి మరో హైఎండ్‌ మోడల్‌ వాహనం వస్తోంది. అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ లంబోర్గినికి చెందిన ఉరాస్‌ త్వరలో ఎన్టీఆర్‌ గ్యారేజీకి చేరనుంది. గతంలో ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు ఈ మోడల్‌ కారులోనే చక్కర్లు కొట్టారు. ఆ రైడ్‌ని బాగా ఎంజాయ్‌ చేసిన తారక్‌ ఉరాస్‌ను తన కలెక్షన్లలో ఉంచాలనుకున్నారు కాబోలు. వచ్చే నెలలో ఈ వాహనం తారక్‌ గ్యారేజ్‌కి చేరుకోనుంది. టాలీవుడ్‌లో ఆల్‌రౌండ్‌ కథానాయకుడిగా పేరున్న తారక్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో కలిసి తెరపై విజృభించనున్నారు. అలాగే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో చిత్రానికి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని