ఆస్ట్రేలియా అవకాశాలకు గండి పడింది అక్కడే!  - justin langer feels slack on their slow over rate issue in melbourne test which evetually cost them wtc final
close
Updated : 09/03/2021 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్ట్రేలియా అవకాశాలకు గండి పడింది అక్కడే! 

మెల్‌బోర్న్‌ టెస్టులో స్లో ఓవర్‌రేటే కారణం: లాంగర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీలో ఆస్ట్రేలియా లేకపోవడం నిరాశకు గురిచేసిందని, అందుకు టీమ్‌ఇండియాతో ఆడిన మెల్‌బోర్న్‌ టెస్టులో తమ స్లో ఓవర్‌ రేట్‌ బౌలింగే కారణమని ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. గతేడాది డిసెంబర్‌ 26న భారత్‌, ఆస్ట్రేలియా జట్లు మెల్‌బోర్న్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్టులో తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అజింక్య రహానె సెంచరీ సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు. కాగా, ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా బౌలింగ్‌ చేసింది. దాంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లు కోతకు గురైంది.

మరోవైపు టీమ్‌ఇండియా అక్కడ 2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ కైవసం చేసుకోవడం, తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్‌ను 3-1 తేడాతో ఓడించడంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అగ్రస్థానం సంపాదించింది. దాంతో జూన్‌ 18న సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తుదిపోరుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలోనే టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుదిపోరులో ఆస్ట్రేలియా లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని లాంగర్‌ అన్నాడు.  మెల్‌బోర్న్‌ టెస్టు పూర్తయ్యాకే తాము స్లో బౌలింగ్‌ చేశామనే విషయం గుర్తొచ్చిందని చెప్పాడు. అది తమ టెస్టు ఛాంపియన్‌షిప్‌ అవకాశాలకు గండి కొడుతుందని అప్పుడే భావించానని తెలిపాడు.

‘ఆ మ్యాచ్‌ ముగిశాక మా ఆటగాళ్లతో మాట్లాడాను. వారికి జరిగిన విషయం వివరించాను. రెండు ఓవర్లు స్లో బౌలింగ్‌ చేశామని, అది టెస్టు ఛాంపియన్‌షిప్‌ అవకాశాలను దూరం చేసే పరిస్థితి కల్పించొచ్చని అన్నాను. తర్వాత ఆడే సిడ్నీ, గబ్బా టెస్టుల్లో అలాంటి తప్పు జరగకూడదని చెప్పాను. అది బాగా నిరాశ కలిగించింది. ఒక గుణపాఠంలా అనిపించింది. ఇకపై జాగ్రత్తగా ఉండాలనే విషయం నేర్పింది’ అని లాంగర్‌ వివరించాడు. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే, అక్కడ కరోనా కేసుల్లో పెరుగుదల కారణంగా కంగారూల జట్టు సిరీస్‌ను రద్దు చేసుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని