కాజల్‌ వెడ్డింగ్‌ పార్టీ.. ఫొటోలు వైరల్‌  - kajal Wedding party photos goes viral
close
Published : 02/11/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాజల్‌ వెడ్డింగ్‌ పార్టీ.. ఫొటోలు వైరల్‌ 

సంగీత కార్యక్రమాలు కూడా..

ముంబయి: అగ్ర కథానాయిక కాజల్‌ తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత అతిథుల కోసం పార్టీ ఏర్పాటు చేశారు. తాజ్‌ హోటల్‌లోనే ఈ కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాజల్‌ మోడ్రన్‌ డ్రెస్‌లో, కిచ్లు సూట్‌లో సందడి చేశారు. ఈ వేడుకలో సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఓ కళాకారిణి వయొలిన్‌ను వాయిస్తుంటే.. కొందరు డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు.

కాజల్‌ వివాహం నేపథ్యంలో సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. అనుష్క, సమంత, కీర్తి సురేశ్‌, తమన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మి, అమలాపాల్‌, సోనూ సూద్‌, హన్సిక, రాశీ ఖన్నా, నివేదా థామస్‌, లావణ్య త్రిపాఠి, నిహారిక, ప్రియమణి, సుశాంత్‌, అనసూయ తదితరులు విష్‌ చేసిన వారిలో ఉన్నారు. కాజల్‌, గౌతమ్‌ జీవితం ప్రేమ, సంతోషం, ఆరోగ్యంతో నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పెళ్లి కుమార్తెగా ‘చందమామ’ చక్కగా ఉందని పేర్కొన్నారు. ‘ఈ భూమిపై మనకు అమితమైన ఆనందాన్ని కల్గించే ఘట్టం వివాహం. ఒకే ఆలోచనతో రెండు హృదయాలు ఒక్కటవుతాయి. ప్రియమైన కాజల్‌, గౌతమ్‌కు శుభాకాంక్షలు’ అని అనుష్క ప్రత్యేక పోస్ట్‌ చేశారు.

పెళ్లి తర్వాత నటనను కొనసాగిస్తానని కాజల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ‘మోసగాళ్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో నటించనున్నారు. ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు 2’ తదితర చిత్రాల్లోనూ సందడి చేయబోతున్నారు. ఆమె నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ విడుదల వాయిదా పడింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని