పెళ్లి కార్డులపై ఆ పేరే ఉంది: కాజల్‌ - kajal aggarwal about her wedding life
close
Published : 13/02/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి కార్డులపై ఆ పేరే ఉంది: కాజల్‌

ఇప్పుడు జీవితం అద్భుతం మారింది అంటోన్న నటి

హైదరాబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త, తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూను వివాహం చేసుకున్నాక తన జీవితం ఎంతో అద్భుతంగా మారిందని నటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. వివాహం తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ‘లైవ్‌ టెలీకాస్ట్‌’ సిరీస్‌లో కాజల్‌ భాగమైంది. హాట్‌స్టార్‌ వేదికగా తాజాగా ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు.

‘‘వివాహం తర్వాత నా జీవితం ఎంతో అద్భుతంగా మారింది. వృత్తిపరమైన జీవితాల్లో మేమిద్దరం ఎప్పుడూ బిజీగానే ఉంటుంటాం. కానీ, ఒక్కసారి ఇంటికి రాగానే మిగిలిన విషయాలను మర్చిపోయి మేమిద్దరం సరదాగా గడపాలని నిర్ణయించుకున్నాం. వివాహం తర్వాత నాతో కొంత సమయం గడపడానికి ఎప్పుడైనా గౌతమ్‌ సెట్‌కు వస్తే అక్కడ ఉన్నవారందరూ ఆయనను గౌరవించడం, ఒక కుటుంబసభ్యుడిలా చూసుకోవడం నాకెంతో సంతోషాన్నిస్తోంది’’

‘‘మా పెళ్లి కార్డులపై ‘కిచ్డ్‌’ అనే పేరే వాడాం. దాంతో ఇటీవల మేము ప్రారంభించిన హోమ్‌ డెకోర్‌ బ్రాండ్‌కు కూడా అదే పేరు పెట్టాం. ఈ బ్రాండ్‌ నుంచి ఎన్నో గృహోపకరణాలను విడుదల చేయనున్నాం. దీనితోపాటు మరో గేమింగ్‌ కంపెనీలో కూడా నేను వాటా కొనుగోలు చేశాను’’ అని కాజల్‌ తెలిపారు.

ఇదీ చదవండి

పాట కోసం దుస్తులు తొలగించమన్నారు

వైష్ణవ్‌.. నీ భయం నాకు తెలుసురామరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని