లైవ్‌ షోలో దెయ్యాన్ని చూపిస్తారట! - kajal aggarwal hotstar specials live telecast official telugu trailer
close
Updated : 30/01/2021 07:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లైవ్‌ షోలో దెయ్యాన్ని చూపిస్తారట!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘లైవ్‌లో దెయ్యాన్ని షూట్‌ చేసి టెలికాస్ట్‌ చెయ్యబోతున్నాం’ అంటున్నారు అగ్ర నటి కాజల్‌. ఆమె కీలక పాత్రలో తెరకెక్కుతున్న వెబ్‌సిరీస్‌ ‘లైవ్‌ టెలికాస్ట్‌’. తమిళంలో రూపొందుతున్న ఈ సిరీస్‌కు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈ వెబ్‌ సిరీస్‌ డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ప్రసారం కానుంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘దెయ్యాన్ని లైవ్‌ టెలికాస్ట్‌ చేద్దామని ఓ ఇంటికి వెళ్లిన టీవీ బృందానికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? నిజంగా వాళ్లకు దెయ్యం కనపడిందా? ఆ తర్వాత వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎలా బయటపడ్డారు? తెలియాలంటే ‘లైవ్‌ టెలికాస్ట్‌’ చూడాల్సిందే. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో వైభవ్‌, ఆనంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజల్‌కు ఇదే తొలి వెబ్‌సిరీస్‌ కావడం విశేషం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని