‘ఇండియన్‌-2’ వాయిదా.. కారణం చెప్పిన కాజల్‌ - kajal aggarwal reveals reason for indian 2 shoot delay
close
Published : 18/03/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఇండియన్‌-2’ వాయిదా.. కారణం చెప్పిన కాజల్‌

చెన్నై‌: విశ్వనటుడు కమల్‌హాసన్‌ - ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రానున్న భారీ ప్రాజెక్ట్‌ ‘భారతీయుడు-2’. సుమారు పాతికేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. కాజల్‌ కథానాయిక. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సినిమా షూట్‌ గతేడాది అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ‘భారతీయుడు-2’ షూట్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడానికి గల కారణాల గురించి అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్‌ అగర్వాల్‌.. షూట్‌ ఆగిపోవడానికి గల కారణాన్ని బయటపెట్టారు. చిత్రబృందంలో పనిచేసే ఎంతోమంది సభ్యులు అమెరికాకు చెందిన వారని.. కరోనా నిబంధనలతో వాళ్లు అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నారని.. అందుకే షూట్‌ వాయిదా పడిందని ఆమె తెలిపారు. మరోవైపు ఈ సినిమా కోసం కాజల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నారు.

1996లో విడుదలైన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. లైకా ప్రొడెక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా అనుకోని కారణాల వల్ల గతేడాది వాయిదా పడింది. సెట్‌లో ప్రమాదం చోటు చేసుకోవడంతో కొన్నిరోజులపాటు వాయిదా పడిన ఈ షూట్‌ కరోనా, లాక్‌డౌన్‌ అనంతరం కూడా పట్టాలెక్కలేదు. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనుకడుగు వేయడంతోనే షూట్‌ ఆగిపోతుందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టారు. ‘భారతీయుడు-2’ షూట్‌ నిలిచిపోవడంతో కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ ప్రాజెక్ట్‌ ఓకే చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని