ఆ ఆవిష్కరణ ముందుగా చూసింది కిచ్లూనే.. - kajal aggarwal shares a romantic throwback with husband gautam kitchlu
close
Published : 05/02/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఆవిష్కరణ ముందుగా చూసింది కిచ్లూనే..

బిజీగా ఉన్నా ఆయన నాతోనే ఉన్నారు

హైదరాబాద్‌: తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి ఏడాదైన సందర్భంగా తాజాగా నటి కాజల్‌ తన ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ఓ అపురూప చిత్రాన్ని షేర్‌ చేశారు. ఇందులో మైనపు విగ్రహంతో పాటు కాజల్, ఆమె భర్త కిచ్లూ కూడా ఉన్నారు.

‘సింగపూర్‌లో నా మైనపు విగ్రహం ప్రారంభించి సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ ప్రపంచం ఎదుట ఆవిష్కరించడానికి ముందే కిచ్లూ దానిని చూశారు. వృత్తిపరంగా తాను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి నాలుగో తేదీన సింగపూర్‌కు వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి జర్మనీ వెళ్లారు. అతని చూపులు నాపైనే ఉన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది’ అని కాజల్‌ ఆనాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.

ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న కాజల్‌-గౌతమ్‌ కిచ్లూ గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి అక్టోబర్‌ 30న ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో వేడుకగా జరిగింది. ఇటీవల ఈ జంట ‘కిచ్డ్‌’ అనే పేరుతో కుషన్స్‌ బిజినెస్‌ ప్రారంభించింది. మరోవైపు కాజల్‌ నటిగా సినిమా షూటింగ్స్‌లతో బిజీగా ఉంటున్నారు.

ఇవీ చదవండి!

నీ పవర్‌ ఇప్పుడు వాడు: మంచు లక్ష్మి

అందుకే ఆమెను బి-గ్రేడ్‌ అనేదిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని