నాగార్జునతో కాజల్‌! - kajal in nagarjuna movie
close
Published : 18/03/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగార్జునతో కాజల్‌!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ చందమామ కాజల్‌కు ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవలేదు. తాజాగా ఆమె కింగ్‌ నాగార్జున సరసన నటించడానికి సిద్ధమైంది. ‘గరుడ వేగ’తో సాలిడ్‌ హిట్టు కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగమౌతున్నందుకు సంతోషంగా ఉందంటూ సదరు నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. పెళ్లైన తర్వాత కాజల్‌ స్క్రిప్ట్‌ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలు కాకుండా కథలో ప్రధాన పాత్రలనే ఎంచుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మెసగాళ్లు’చిత్రంలో విష్ణుకు అక్కగా నటించటమే ఇందుకు తార్కాణం. అలాగే ‘ఆచార్య’లో కూడా కథకు అవసరమైన కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు యాక్షన్‌ డ్రామా తెరకెక్కుతున్న నాగ్‌, కాజల్‌ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమా సంస్థ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాకు సంబంధించి మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరోవైపు నాగార్జున నటించిన ‘వైల్డ్‌ డాగ్‌’ ఏప్రిల్‌ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని