హిందీ ‘ఖైదీ’లో అజయ్‌ సరసన కాజల్‌? - kajal to star in kaithis hindi remake
close
Published : 09/06/2021 22:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హిందీ ‘ఖైదీ’లో అజయ్‌ సరసన కాజల్‌?

ఇంటర్నెట్‌  డెస్క్: ‘లక్ష్మీకల్యాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ కాజల్‌ అగర్వాల్‌. తెలుగు, తమిళ సినిమాల్లో నాయికగా రాణిస్తూనే అప్పుడప్పుడు బాలీవుడ్‌లోనూ నటిస్తూ సందడి చేస్తుంది. ప్రస్తుతం హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌తో కలిసి ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమైందనే వార్తలొస్తున్నాయి. తమిళంలో కార్తి హీరోగా నటించిన ‘ఖైదీ’ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అజయ్‌ దేవగణ్‌ నాయకుడిగా నటిస్తుండగా ఆయన సరసన నాయికగా కాజల్‌ని తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. తమిళంలో కార్తి నటించిన ‘ఖైదీ’లో నాయిక పాత్ర మనకు కనిపించదు. కానీ హిందీలో మాత్రం కథలో కొన్ని మార్పులు చేసి నాయిక ప్రాతను కూడా పరిచయం చేయనున్నారట. ఇప్పటికే చిత్రబృందం కాజల్‌ని సంప్రదించగా అందుకు ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. కాజల్‌ పదేళ్ల కిందటే అజయ్‌తో కలిసి  ‘సింగం’లో నటించి మెప్పించింది. ఇది కూడా తమిళంలో సూర్య నటించిన ‘సింగం’ చిత్రానికి రీమేక్‌. మొత్తం మీద అజయ్ అన్నదమ్ముల (సూర్య-కార్తి) చిత్రాలపై మోజు పెంచుకొని హిందీలో రీమేక్ చేస్తూ మెప్పిస్తున్నారు. కాజల్‌ హిందీలో 2004లో  సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో ఐశ్వర్యరాయ్‌ సోదరిగా నటించింది. గత ఏడాదిలో గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్‌కి సినిమా అవకాశాలు ఏమాత్రం తగ్గట్లేదు. ఇటీవల బాలీవుడ్‌లో ‘ఉమ’ అనే చిత్రంలో కీల‌క పాత్రకి ఎంపికైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి స‌ర‌స‌న ‘ఆచార్య‌’లో నటిస్తోంది. మరో తెలుగు హీరో నాగార్జున‌తోనూ ఓ సినిమాలోనూ నాయికగా నటించే అవకాశం దక్కించుకుంది. ప్ర‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని