కమల్‌ ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక విరామం - kamal haasan leg pain bed rest
close
Published : 21/03/2021 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమల్‌ ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక విరామం

చెన్నై: మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఇటీవల శస్త్ర చికిత్స నిర్వహించిన కాలికి కొద్దిపాటి వాపు రావడంతో శనివారం తన ప్రచారాన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేశారు. కోవై దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆయన కోవైలోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కోవై దక్షిణ, తొండాముత్తూర్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. పూలమార్కెట్‌, ఆర్‌ఎస్‌పురం, గాంధీపార్కు పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ నడిచి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఎంఎన్‌ఎం అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం టీ దుకాణంలో ప్రజలతో కలసి కూర్చుని టీ తాగారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను తెలిపారు. అనంతరం కమల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు కొందరు పోటీ పడ్డారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స జరిగిన కాలిని తొక్కడంతో వాపు ఏర్పడింది. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

ఈ నేపథ్యంలో సింగానల్లూర్‌ బహిరంగసభ మినహా మిగిలిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కమల్‌ కాలు వాపు వచ్చిందని తెలిసి ఆయనపై పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి వానతీ శ్రీనివాసన్‌ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని