బాధ్యతతో టీకా వేయించుకోవాలి: కమల్‌హాసన్‌ - kamal haasan takes vaccination
close
Published : 02/03/2021 22:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాధ్యతతో టీకా వేయించుకోవాలి: కమల్‌హాసన్‌

చెన్నై: వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సమాజ శ్రేయస్సును బాధ్యతగా భావించే వారంతా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని నటుడు కమల్‌హాసన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకుంటున్నప్పుడు తీసిన దృశ్యాలను ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. టీకా అనేది కేవలం మన వ్యక్తిగత జీవితాలపైనే కాదు మొత్తం సమాజంపై ప్రభావం చూపిస్తుందని కమల్‌ అన్నారు.

నేను కరోనా టీకా వేయించుకున్నాను. తమ వ్యక్తిగత జీవితంపై ప్రేమ, సమాజంపై బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి. అంతేకాదు.. ఇతరులకూ అవగాహన కల్పించాలి. ప్రస్తుతానికి కోవిడ్‌ టీకాలు వేయించుకోండి. వచ్చే నెల నుంచి అవినీతికి వ్యతిరేకంగా మనమందరం పోరాడవచ్చు. - కమల్‌హాసన్‌

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అందులో భాగంగా 60ఏళ్ల వయసు పైబడిన వాళ్లందరికీ టీకా అందిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీకా వేయించుకున్నారు. 66ఏళ్ల కమల్‌హాసన్‌ తాజాగా టీకా వేయించుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘విక్రమ్‌’ సినిమాలో కమల్‌హాసన్‌ చేస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌2’లోనూ ఆయన నటిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా కనిపిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని