లోకనాయకుడికి కోపమొస్తే..! - kamal haasan throws torchlight in frustration during roadshow
close
Published : 01/04/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లోకనాయకుడికి కోపమొస్తే..!

చెన్నై: హోరాహోరీగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం.. పైగా ఎండ వేడిమి.. కొద్ది సమయంలోనే వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలు తిరిగి ఓటర్లను కలుసుకోవాలి.. దాదాపు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలన్నింట్లోనూ నేతల పరిస్థితి ఇదే. ఇలాంటి సందర్భంలో ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే? సదరు నేతకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఒక్కసారిగా ఆయన సహనం కోల్పోయి చేతిలో ఉన్న తన పార్టీ ఎన్నికల గుర్తు టార్చ్‌లైట్‌ను విసిరి కొట్టారు. కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ప్రజలనుద్దేశించి ప్రసంగం మొదలు పెడదామనుకునే సమయానికి మైక్రోఫోన్‌ పనిచేయకపోవడం ఆయనకు కోపం తెప్పించింది. దీంతో కమల్‌ తాను ప్రయాణిస్తున్న వాహనంలోని సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న టార్చ్‌లైట్‌ను విసిరి కొట్టారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని