సూపర్‌స్టార్‌ను కలిసిన కమల్‌హాసన్‌  - kamal meets rajanikanth
close
Updated : 20/02/2021 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూపర్‌స్టార్‌ను కలిసిన కమల్‌హాసన్‌ 

చెన్నై: ప్రముఖ సినీనటుడు, మక్కల్‌నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను కలిశారు.  మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరిద్దరి భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, వీరిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ రజనీ ప్రకటించిన తర్వాత ఆయనతో కమల్‌ భేటీ కావడం ఇదే తొలిసారి.

రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడతారంటూ ఎంతో కాలంగా కొనసాగిన చర్చలకు  గతేడాది డిసెంబర్‌లో ఆయన చెక్‌పెట్టిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన విరమించుకుంటున్నట్టు స్పష్టంచేశారు. దీంతో సూపర్‌స్టార్‌ రాజకీయ ఎంట్రీ కోసం  ఎంతో ఆశతో ఎదురుచూసిన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు, రజనీ ప్రకటన తననూ ఎంతో నిరాశకు గురిచేసిందని అప్పట్లో కమల్‌ కూడా వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యం కూడా తనకెంతో ముఖ్యమన్నారు. ఆ సమయంలో తిరుచ్చిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్‌.. ప్రచారం ముగిశాక రజనీకాంత్‌ను కలుస్తానని చెప్పారు.

మరోవైపు, కమల్‌హాసన్‌ 2018లో మక్కల్‌నీది మయ్యం పార్టీని స్థాపించారు. ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. రజనీకాంత్‌ను కలిసి మద్దతు కోరతానంటూ ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని