close
Published : 05/05/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Twitter అమెరికా బుద్ధి చూపించింది: కంగన

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక, రాజకీయాంశాలపై సోషల్‌ మీడియా వేదికగా తనదైన శైలిలో క్రమం తప్పకుండా స్పందిస్తూ ఉంటుంది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఈ క్రమంలోనే కొన్నిసార్లు తీవ్రవైన విమర్శలు ఎదుర్కొంటూ.. తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా.. కంగన ఖాతాను ట్విటర్‌ యాజమాన్యం శాశ్వతంగా తొలగించింది. ఆ తర్వాత కంగన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. ట్విటర్‌ తన అమెరికా బుద్ధి చూపిందని మండిపడింది.

‘‘నా ఖాతాను తొలగించడం ద్వారా ట్విటర్‌ పుట్టుకతోనే అమెరికా అని మరోసారి రుజువు చేసింది. నల్లజాతివారిని శ్వేతజాతి ఎప్పుడూ బానిసలుగానే భావిస్తుంది. మనం ఏం ఆలోచించాలి.. మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే నిర్ణయించాలనుకుంటారు. ఇదొక్కటే కాదు.. నా గొంతు వినిపించడానికి నాకు ఎన్నో మార్గాలున్నాయి. నా సినిమా కూడా అందులో భాగమే’ అని కంగన పేర్కొంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న హింస గురించి మాట్లాడుతూ.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. దీంతో కంగన ట్విటర్‌ హ్యాండిల్‌ నిషేధానికి గురైంది.


COcO8vyhlbG

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని