Kangana Ranaut: ట్విటర్‌ ఖాతా నిలిపివేత - kangana ranaut account has been permanently suspended
close
Updated : 04/05/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kangana Ranaut: ట్విటర్‌ ఖాతా నిలిపివేత

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ట్విటర్ ఖాతాను శ్వాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్‌ చేయడం ద్వారా ట్విటర్‌ నియమ, నిబంధనలను ఆమె ఉల్లంఘించారని పేర్కొంది. విద్వేషపూరిత, అసభ్య ప్రవర్తన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇటీవల పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం కంగన చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కించపరిచేలా ఆమె ట్వీట్‌ ఉండటంతో సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింస పెచ్చరిల్లే అవకాశం ఉందని జర్నలిస్ట్‌ స్వపన్‌ దాస్‌గుప్త చేసిన ట్వీట్‌కు కంగనా బదులిస్తూ వివాదాస్పదంగా స్పందించింది.  దీంతో కంగనా ట్విటర్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్విటర్‌ అధికారి ప్రతినిధి తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని