Kangana: మహారాష్ట్ర ప్రభుత్వం నన్ను వేధిస్తోంది - kangana ranaut claims she is being harassed by the maharashtra government for the renewal of her passport
close
Published : 17/06/2021 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kangana: మహారాష్ట్ర ప్రభుత్వం నన్ను వేధిస్తోంది

ఆమిర్‌ఖాన్‌కు ఇలా ఎందుకు చేయలేదు

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. తాజాగా ఆమె మరోసారి మహా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం తనని పరోక్షంగా వేధిస్తోందని ఆమె అన్నారు. ఇటీవల పాస్‌పోర్ట్‌ విషయంలో కంగన చేదు అనుభవాన్ని చవి చూసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా వేదికగా.. ‘మహావినాశకారి ప్రభుత్వం (మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) నన్ను మరోసారి పరోక్షంగా వేధింపులకు గురిచేస్తోంది. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి నాపై పెట్టిన కేసు కారణంగా నా పాస్‌పోర్ట్‌ పునరుద్ధరణకు అధికారులు తిరస్కరించారు. ఈ విషయమై హైకోర్టుకు వెళ్తే.. నా అప్లికేషన్ అస్పష్టంగా ఉందని పేర్కొంటూ జూన్‌ 25కి విచారణ వాయిదా వేసింది’ అని కంగన పేర్కొన్నారు. అంతేకాకుండా భారత ప్రభుత్వాన్ని దూషిస్తూ కొన్ని సంవత్సరాల క్రితం అమిర్‌ఖాన్‌ ఆరోపణలు చేస్తే.. అతని పాస్‌పోర్ట్‌ను నిలిపివేయలేదని, అతని సినిమా షూటింగ్స్‌కి ఆటంకం కలగనివ్వలేదన్నారు. కానీ, తనని మాత్రమే ఈ విధంగా వేధిస్తున్నారని ఆమె అన్నారు.

ప్రస్తుతం కంగన ‘తేజస్‌’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూట్‌ కోసం ఆమె హంగేరిలోని బుడాపెస్ట్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆమె ముంబయిలోని పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లింది. పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేయాలంటే పోలీస్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి. అయితే.. బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై దేశద్రోహం కేసు నమోదై ఉండటంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ బాలీవుడ్‌ నటి ముంబయి హైకోర్టును ఆశ్రయించింది. సినిమా చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉన్నందున పాస్‌పోర్టు పునరుద్ధరణకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరింది. అయితే.. కంగన చేసిన దరఖాస్తు అస్పష్టంగా ఉందని చెప్పిన హైకోర్టు.. ఆమె కేసును జూన్‌ 25కు వాయిదా వేసింది. ఇన్నాళ్లు ఆమె కోర్టును ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కంగన మహా ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తాజాగా పోస్ట్‌ పెట్టింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని