హే తాప్సీ.. నా పేరు లేకుండా మూవీ ప్రమోట్‌ చేసుకో - kangana ranaut hits back at taapsee pannu for calling her irrelevant
close
Published : 01/07/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హే తాప్సీ.. నా పేరు లేకుండా మూవీ ప్రమోట్‌ చేసుకో

మరోసారి హీరోయిన్స్‌ మధ్య మాటల యుద్ధం

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు తాప్సీ పన్ను-కంగనా రనౌత్ మధ్య పచ్చగడ్డి వేసినా  భగ్గుమనేలా ఉంది. వాళ్లిద్దరి మధ్య ఎంతోకాలం నుంచి జరుగుతున్న కోల్డ్‌వార్‌ కంట్రోలయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు సోషల్‌మీడియా వేదికగా మాటల చురకలు పెట్టుకున్న ఈ భామలు చాలారోజుల తర్వాత మరోసారి వాగ్వాదానికి తెర తీస్తున్నారు. ఇటీవల కొన్నిరోజులపాటు రష్యా టూర్‌కు వెళ్లి వచ్చిన తాప్సీ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘హసీనా దిల్‌రుబా’ ప్రమోషన్‌లో బిజీగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్రమోషన్‌లో భాగంగా.. ‘కంగనకు తన జీవితంలో ఎలాంటి ప్రాధాన్యం లేదు’ అని తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగన స్పందించారు.

‘నేను వదిలేసిన ప్రాజెక్ట్‌ల్లో తనకి అవకాశం కల్పించమని తాప్సీ ఎంతో మంది నిర్మాతలను బతిమలాడుకుని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. చిన్నస్థాయి నిర్మాతలకు కంగనా రనౌత్‌లా మారినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని తాప్సీ ఒకానొక సమయంలో చెప్పారు. కానీ ఇప్పుడు, తన జీవితంలో నాకు ఎలాంటి ప్రాధాన్యం లేదు అంటున్నారు. మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం. ఏది ఏమైనా తాప్సీ.. నీ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అలాగే, నా పేరు లేకుండా నీ సినిమా ప్రమోట్‌ చేసుకో’ అని కంగన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

‘మేడమ్‌.. ఎన్నో రోజుల నుంచి మీకూ, కంగనా రనౌత్‌కు మధ్య ట్విటర్‌ వేదికగా చిన్నపాటి వాగ్వాదం నడిచింది. ఇప్పుడు ఆమె ట్విటర్‌లో లేదు కదా. ఆమెను మీరు ఏమైనా మిస్‌ అవుతున్నారా?’ అని సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న తాప్సీని పలువురు విలేకర్లు ప్రశ్నించగా.. ఆమెను పట్టించుకోను కాబట్టి ట్విటర్‌లో ఆమె లేకపోయినా నేను మిస్‌ కావడం లేదు’ అని తాప్సీ తెలిపారు. ఈ వ్యాఖ్యలపైనే కంగన కౌంటర్‌ ఇచ్చారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని