Kangana: నా సోదరికి 53 సర్జరీలు జరిగాయి - kangana ranaut says yoga helped sister rangoli after acid attack
close
Updated : 21/06/2021 16:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kangana: నా సోదరికి 53 సర్జరీలు జరిగాయి

యోగా రంగోలీ జీవితాన్నే మార్చేసింది

ముంబయి: తన సోదరి రంగోలీ జీవితాన్ని యోగా ఎంతగానో మార్చేసిందని ప్రముఖ కథానాయిక, బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆమె తన సోదరికి జరిగిన ప్రమాదం గురించి మరోసారి నెటిజన్లతో పంచుకున్నారు. తన సోదరి రంగోలీపై ఓ ప్రేమోన్మాది యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడని.. దాడి కారణంగా రంగోలీ మానసికంగా, శారీరకంగా ఎంతో ఆవేదనకు లోనైందని.. చివరికి మాట్లాడడం కూడా మానేసిందని కంగన తెలిపారు.

‘రంగోలీకి 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఓ ఆకతాయి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. రంగోలీ నో చెప్పడంతో ఆగ్రహానికిలోనైన అతను ఓసారి యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సగానికి పైగా రంగోలీ ముఖం కాలిపోయింది. ఒక కంటి చూపు కోల్పోయింది. అలాగే ఒక చెవి పూర్తిగా కాలిపోయింది. ఛాతిభాగం సైతం బాగా దెబ్బతింది. సుమారు మూడేళ్లలో ఆమెకు 53 సర్జరీలు జరిగాయి. యాసిడ్‌ దాడి జరగడానికి కొన్ని రోజుల ముందు ఎయిర్‌ఫోర్స్‌ అధికారితో అక్కకి ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. యాసిడ్‌ దాడి తర్వాత రంగోలీ ముఖం చూసి.. అతను వదిలివెళ్లిపోయాడు. మరలా తిరిగి రాలేదు. దీంతో తను మానసికంగా కుంగుబాటుకు లోనయ్యింది. దాంతో మాట్లాడడం మానేసింది. మేము ఎంత మాట్లాడినా తిరిగి సమాధానం చెప్పేది కాదు. కేవలం చూస్తూ కూర్చునేది.  ఎంతోమంది మానసిక నిపుణులను కలిశాం. మందులు వాడాం. అలాంటి సమయంలోనే ఓసారి రంగోలీని నాతోపాటు యోగా శిక్షణకు తీసుకెళ్లాను. నాతోపాటు తను కూడా యోగా చేయడం ప్రారంభించింది. యోగా వల్ల తన జీవితం ఎంతో మారింది. నాతో మాట్లాడడం ప్రారంభించింది. కంటి చూపు కూడా కొంతవరకూ నయమైంది’ అని కంగన పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని