sanchari vijay: కన్నడ నటుడు కన్నుమూత - kannada actor sanchari vijay declared brain dead family to donate his organs
close
Updated : 14/06/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

sanchari vijay: కన్నడ నటుడు కన్నుమూత

కన్నడ చిత్రసీమలో విషాదఛాయలు

బెంగళూరు: కన్నడ చిత్రసీమలో విషాదఛాయలు అలముకున్నాయి. కన్నడ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సంచారీ విజయ్‌ సోమవారం కన్నుమూశారు. ఈనెల 12న స్నేహితుడిని కలిసి బైక్‌ మీద ఇంటికి వస్తున్న విజయ్‌కి మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది. వెంటనే బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా మెదడు కుడి భాగాలతో పాటు తొడల ప్రాంతాల్లో తీవ్రమైన గాయాలై..  ప్రాణాపాయ స్థితికి వెళ్లిన ఆయనకి సర్జరీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. మరణానంతరం ఆయన శరీరభాగాలను అవయవ దానం చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

2011లో ‘రంగ్గప్పా హోగ్బిట్నా’తో కన్నడ చిత్రసీమకు పరిచయమైన విజయ్‌.. ‘దాస్వాళ’, ‘హరివు’, ‘ఒగ్గరణె’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వర్తమాన’, ‘సిపాయి’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కాగా 2015లో వచ్చిన ‘నాను అవనల్ల, అవళు’ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఈ చిత్రంలో ఆయన ట్రాన్స్‌జెండర్‌గా నటించారు. విజయ్‌ మరణవార్త విని చిత్రసీమ శోకసంద్రంలో మునిగి పోయింది. ట్విటర్‌ వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని తోటినటులు గుర్తుచేసుకున్నారు. ఇదే రోజున(జూన్‌ 14) సుశాంత్‌ సింగ్‌ కూడా చనిపోవడం గమనార్హం.

లాక్‌డౌన్‌కి ముందు కలిశాం -  నటుడు​ ​​​​​​కిచ్చసుదీప్‌

‘సంచారీ విజయ్‌ లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. లాక్‌డౌన్‌కి  ముందు కొన్నిసార్లు విజయ్‌ని కలిశాను. తదుపరి చిత్రం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరగడం చాలా బాధాకరం. అతని కుటుంబసభ్యుల సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ -ట్విటర్‌లో సుదీప్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని