close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/07/2020 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ మలయాళ చిత్రం తెలుగులో రీమేక్‌

హైదరాబాద్‌: మలయాళం కథలు తెలుగుకి వరుస కడుతున్నాయి. రీమేక్‌ కోసం ఒక దాని వెంట మరో కథ తెలుగులోకి వస్తోంది. ‘లూసిఫర్‌’, ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’... ఇలా ఈ వరసలోకి మరో కథ కూడా చేరింది. అదే... ‘కప్పెలా’. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం రీమేక్‌ హక్కుల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ చేజిక్కించుకుంది.

ఇద్దరు యువ హీరోలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు ‘సితార’ సంస్థ వర్గాలు తెలిపాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.