మగబిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్‌ - kareena kapoor and saif ali khan blessed with a baby boy!
close
Updated : 21/02/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మగబిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్‌

ముంబయి: బాలీవుడ్‌ అగ్రకథానాయిక, బేబో కరీనాకపూర్‌ మరోసారి తల్లయ్యారు. ఆదివారం ఆమె ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో కపూర్-ఖాన్‌ నివాసాల్లో వేడుకలు జరుగుతున్నాయి. తల్లీ బిడ్డా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మరోవైపు కరీనా దంపతులకు సంబంధించిన చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో పుత్రోత్సహంతో సైఫ్‌ కరీనా నుదిటిపై ముద్దు పెడుతూ కనిపించారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌తో ప్రేమలో పడిన కరీనా 2012లో ఆయనతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులకు 2016లో తైమూర్‌ అలీఖాన్‌ జన్మించాడు. ఈ క్రమంలోనే తాను మరోసారి గర్భం దాల్చానని గతేడాది కరీనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి కరీనా.. ఆమిర్‌ఖాన్‌ సరసన ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని