‘కర్ణన్‌’ కథేంటి.. తెలిసేది ఆరోజే - karnan first look and release date
close
Published : 14/02/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కర్ణన్‌’ కథేంటి.. తెలిసేది ఆరోజే

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ధనుష్‌ హీరోగా ‘మారి’ సెల్వరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్ణన్‌’. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు.  తాజాగా ధనుష్‌ ఫస్ట్‌లుక్‌ని అభిమానులతో పంచుకుంటూ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. పోస్టర్‌లో నెత్తుటి మరకలతో.. సంకెళ్లతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చి సినిమాపై ఆసక్తని పెంచుతున్నాడు ధనుష్‌.

ఈ కథ ఓ గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ డ్రామా అని సమాచారం. మరి ధనుష్‌ ఆ గ్రామం కోసం ఏం చేశాడు? ఎందుకు ఇలా నేరస్థుడిలా మారాడు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఏప్రిల్‌ వరకు ఆగాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ సినిమా. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌మెంట్‌ టీజర్‌ సినీ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంది.

ఇదీ చదవండి..

గోపీచంద్‌-మారుతి కాంబో టైటిల్‌ ఇదే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని