బెంగళూరు: ‘కేజీయఫ్2’ టీజర్లో మీకు ఇష్టమైన సన్నివేశం ఏంటి..? అని అడిగితే చాలామంది నుంచి ‘మెషిన్‌గన్‌ను ఉపయోగించి హీరో సిగరెట్ కాల్చే సీన్’ అనే జవాబు వస్తుంది. నిజానికి ఆ సీన్ వల్లే టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల వర్షం కురిపిస్తోంది కూడా. జనవరి 7న విడుదలైన ఈ టీజర్ వారం రోజుల్లోనే 150 మిలియన్ల వీక్షణలు, 7.5మిలియన్ల లైక్‌లు సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ టీజర్‌పై కర్ణాటక ఆరోగ్యశాఖ, యాంటీ టొబాకో సెల్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. చిత్రబృందంతో పాటు హీరో యశ్‌కు కూడా నోటీసులు పంపించాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
‘కేజీయఫ్2’ టీజర్లో భాగంగా మెషిన్‌గన్‌తో జీపులను కాలుస్తాడు హీరో. ఆ తర్వాత నిప్పులా మారిన గన్ బారెల్ను ఉపయోగించి సిగరెట్ వెలిగించుకుంటాడు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఆ సమయంలో ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని వేయాల్సిన ప్రకటనను చిత్రబృందం విస్మరించింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా యాంటీ టొబాకో సెల్ అధికారులు చిత్రబృందానికి నోటీసులు పంపించారు. వెంటనే టీజర్ నుంచి ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరారు. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధానపాత్రలో ప్రశాంత్‌నీల్ ‘కేజీయఫ్2’ను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు.
ఇదీ చదవండి..
క్షమాపణలు చెప్పిన విజయ్‌సేతుపతి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
-
నా జీవితంలో ఇది ఒక ఆణిముత్యం
-
34 ఏళ్లకు.. అనుపమ్ టాలీవుడ్ ఎంట్రీ
-
అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నుంచి ఇంట్రెస్టింగ్ మూవీ
గుసగుసలు
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- మహేశ్‌బాబు వీరాభిమానిగా నాగచైతన్య..!
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
రివ్యూ
ఇంటర్వ్యూ
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!