‘కేజీయఫ్‌2’ టీజర్‌పై అభ్యంతరం.. నోటీసులు - karnataka anti tobacco cell object to smoking scene in kgf 2 teaser
close
Updated : 17/01/2021 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేజీయఫ్‌2’ టీజర్‌పై అభ్యంతరం.. నోటీసులు

బెంగళూరు: ‘కేజీయఫ్‌2’ టీజర్‌లో మీకు ఇష్టమైన సన్నివేశం ఏంటి..? అని అడిగితే చాలామంది నుంచి ‘మెషిన్‌గన్‌ను ఉపయోగించి హీరో సిగరెట్‌ కాల్చే సీన్‌’ అనే జవాబు వస్తుంది. నిజానికి ఆ సీన్‌ వల్లే టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డుల వర్షం కురిపిస్తోంది కూడా. జనవరి 7న విడుదలైన ఈ టీజర్‌ వారం రోజుల్లోనే 150 మిలియన్ల వీక్షణలు, 7.5మిలియన్ల లైక్‌లు సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ టీజర్‌పై కర్ణాటక ఆరోగ్యశాఖ, యాంటీ టొబాకో సెల్‌ అభ్యంతరం వ్యక్తం చేశాయి. చిత్రబృందంతో పాటు హీరో యశ్‌కు కూడా నోటీసులు పంపించాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

‘కేజీయఫ్‌2’ టీజర్‌లో భాగంగా మెషిన్‌గన్‌తో జీపులను కాలుస్తాడు హీరో. ఆ తర్వాత నిప్పులా మారిన గన్ బారెల్‌ను ఉపయోగించి సిగరెట్ వెలిగించుకుంటాడు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఆ సమయంలో ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని వేయాల్సిన ప్రకటనను చిత్రబృందం విస్మరించింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా యాంటీ టొబాకో సెల్‌ అధికారులు చిత్రబృందానికి నోటీసులు పంపించారు. వెంటనే టీజర్‌ నుంచి ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరారు. కన్నడ స్టార్‌ హీరో యశ్‌ ప్రధానపాత్రలో ప్రశాంత్‌నీల్‌ ‘కేజీయఫ్‌2’ను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు.

ఇదీ చదవండి..

క్షమాపణలు చెప్పిన విజయ్‌సేతుపతి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని