అవసరమైతే లాక్‌డౌన్‌ విధిస్తాం! - karnataka cm says lockdown could be imposed if need arises
close
Published : 12/04/2021 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవసరమైతే లాక్‌డౌన్‌ విధిస్తాం!

బెంగళూరు: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ వంటి చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరం అనిపిస్తే కర్ణాటకలో లాక్‌డౌన్‌ విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఎస్.యడుయూరప్ప సోమవారం అన్నారు. ‘ప్రజలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటాం. లాక్‌డౌన్‌ అనివార్యమైతే విధిస్తాం’ అని అన్నారు.

సెకండ్‌ వేవ్‌లో ఆదివారం నాటికి రాష్ట్రంలో 10వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా తనతో స్వయంగా మాట్లాడారని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారని వివరించారు. ‘కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రధానికి వివరించా’ అని యడుయూరప్ప తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌లు వాడాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. ‘ప్రజలు తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా సహకరించని పక్షంలో తప్పకుండా చర్యలు ఉంటాయి. అందుకు అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నా. ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి సహకరించండి’ అని విజ్ఞప్తి చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని