Curfew : ప్రజలకు యడియూరప్ప విన్నపం - karnataka lockdown: cm yediyurappa appeals to people to follow covid protocols
close
Updated : 28/04/2021 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Curfew : ప్రజలకు యడియూరప్ప విన్నపం

బెంగళూరు: కరోనా ఉద్ధృతి పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ తరహా కర్ఫ్యూ (Curfew) విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం యాడియూరప్ప రాష్ట్రంలో కఠిన నియమాలతో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ట్విటర్‌ ద్వారా తెలిపారు.

‘‘కరోనా (Corona) వైరస్‌ గొలుసును బ్రేక్‌ చేయడానికి రెండు వారాల పాటు కఠిన నిబంధలను అమలు చేస్తున్నాము. అందరికీ నా విన్నపం ఏంటంటే.. విధిగా కర్ఫ్యూ నిబంధలను పాటించి ప్రభుత్వానికి సాయపడండి. ఇళ్లల్లోనే ఉండండి. అత్యవసర సమయంలో తప్ప బయటకి రావద్దు. మనందరం కలిసి కరోనా ఓడిద్దాం’’ అని యాడియూరప్ప ట్వీట్‌ చేశారు. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణను ఆరు నెలలు వాయిదా వేయడం సహా అనేక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ (Lockdown) తరహా ఆంక్షలను రాష్ట్రంలో అమలు చేయనున్నారు.

ఇదిలా ఉంటే కర్ణాటకలో కొత్తగా 31,830 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 180 మంది కరోనా వైరస్‌ సోకి మరణించారు. కాగా మంగళవారం 10,793 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని