Karnataka:​​​​జూన్‌7 నుంచి కర్ణాటకలో అన్‌లాక్‌? - karnataka may ease covid curbs from june 7
close
Published : 25/05/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Karnataka:​​​​జూన్‌7 నుంచి కర్ణాటకలో అన్‌లాక్‌?

కేసుల సంఖ్య బట్టి తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం 

బెంగళూరు: రాబోయే రోజుల్లో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గితే జూన్ 7 తర్వాత లాక్‌డౌన్‌ను సడలించేందుకు కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సందర్భంగా దశలవారీగా అన్‌లాక్‌ ప్రక్రియను చేపట్టేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప ప్రభుత్వ అధికారులు, నిపుణులను కోరారు. అన్‌లాకింగ్ 3-4 దశల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై కొవిడ్ -19 క్లినికల్ నిపుణుల ప్యానెల్ ఛైర్మన్ డాక్టర్ ఎస్.సచ్చిదానంద్ మాట్లాడుతూ.. జూన్ చివరి నాటికి  రెండో దశ తగ్గుతుందని, ప్రస్తుత ధోరణిని పరిశీలిస్తే ఇంకాస్త ముందుగానే పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయని తెలిపారు. మరో వైద్యుడు డా.ఎం.కె.సుదర్శన్ లాక్‌డౌన్‌ నిబంధనలను వివరిస్తూ.. అన్‌లాకింగ్ ఎక్కువగా గత సంవత్సరం తరహాలోనే ఉంటుందని, ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలకు కట్టుబడి ఉంటే  వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉంటుందని పేర్కొన్నారు. బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. “బెంగళూరులో రికవరీలు పెరగడంతో పాటు కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గింది. మహమ్మారిపై పోరాడటానికి ప్రజలు బిబిఎంపితో చేతులు కలిపితే, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభంతో పాటు కేసులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది’’ అన్నారు. మే 1 నుంచి 7 వరకూ 1,51,722 కేసులు నమోదవ్వగా.. మే 15 నుంచి 21 మధ్య 74,531 మందికి వైరస్‌ సోకింది. సోమవారం కర్ణాటక రాష్ర్ట ఆరోగ్యశాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం...25,311 కొత్త కేసులు నమోదవగా, 529 మందిని వైరస్‌ బలి తీసుకుంది. 57,333 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 24 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4.4 లక్షలు దాటింది.  



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని