ఇంటినే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చిన మంత్రి!   - karnataka minister bommai turns house into covid care centre
close
Published : 14/05/2021 21:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటినే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చిన మంత్రి! 

బెంగళూరు: కరోనా సెకండ్‌ వేవ్‌తో కర్ణాటక విలవిలలాడుతోంది. ఆస్పత్రుల్లో బెడ్‌లు.. ఆక్సిజన్‌ కొరతతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై తన ఇంటినే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చి గొప్ప ఉదారతను చాటుకున్నారు. హవేరి జిల్లా శిగ్గవిలో తన ఇంటిని 50మంది రోగులకు సరిపడేలా బెడ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. శిగ్గవి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి.. అక్కడ పలువురు వైద్యులు, వైద్య సిబ్బందిని కూడా నియమించినట్టు తెలిపింది. ఇంటి పరిసరాల్లోని వరాండాలో 50 పడకలు ఏర్పాటు చేశారని, శ్వాస తీసుకొనేందుకు ఇబ్బందులు పడే రోగుల కోసం ఆక్సిజన్‌ కాన్స్‌ంట్రేటర్లు కూడా అందుబాటులో ఉంచాలని మంత్రి భావిస్తున్నారని కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో ఒక మంత్రి నివాసాన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఈ సెంటర్‌ ఏర్పాటుతో నియోజకవర్గంలోని తాలుకా ఆస్పత్రిపై భారం కొంత వరకు తగ్గుతుందని తెలిపింది. 

కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడైన బసవరాజ్‌ బొమ్మై, ఆయన కుటుంబ ఎక్కువగా బెంగళూరు లేదా హుబ్లీలోనే నివాసం ఉంటారు. నియోజకవర్గాన్ని సందర్శించే సమయంలో మాత్రమే శిగ్గవిలో బసచేస్తారని హోంమంత్రి కార్యాలయం తెలిపింది.

మరోవైపు, కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడీ కూడా ఈ సంక్షోభ సమయంలో తన వంతు సహకారం అందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. బెళగావి జిల్లాలోని అఠానీలో 50 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. ఇందుకోసం ఆయన వ్యక్తిగతంగా రూ.50లక్షలు ఇచ్చారని ఆయన కార్యాలయం వెల్లడించింది. కిట్టూర్‌ రాణి చెన్నమ్మ హాస్టల్‌లో దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని