Karthi Sardar: ‘సర్దార్‌’గా మారిన కార్తి - karthi sardar first look
close
Published : 25/04/2021 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Karthi Sardar: ‘సర్దార్‌’గా మారిన కార్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగైదు నెలల క్రితం మొదలైన ఈ సినిమా పేరును చిత్రబృందం తాజాగా ప్రకటించింది. సినిమాకు ‘సర్దార్‌’ అనే పేరును ఖరారు చేస్తూ కర్టన్‌ రైజర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా దర్శకనిర్మాతలు విడుదల చేశారు. పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచాడు కార్తి. జీవీ ప్రకాశ్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. వీడియో చూస్తుంటే భారత్‌- చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోన్న కథ అనిపిస్తోంది.

ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, రజిషా విజయన్‌ నాయికలు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇప్పటికే ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నారు కార్తి. దర్శకుడు మిత్రన్‌ కూడా తెలుగు వారికి సుపరిచితమే. విశాల్‌ హీరోగా వచ్చిన ‘అభిమన్యుడు’ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని