‘సుల్తాన్‌’లో విలన్‌ ఎవరన్నదే పజిల్‌ - karthi sulthan director bakkiyaraj kannan special interview
close
Published : 29/03/2021 14:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సుల్తాన్‌’లో విలన్‌ ఎవరన్నదే పజిల్‌

‘రెమో’ సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన యువ దర్శకుడు బక్కియరాజ్‌ కణ్ణన్‌. ఇప్పుడాయన కథానాయకుడు కార్తితో తెరకెక్కించిన చిత్రం ‘సుల్తాన్‌’. రష్మిక కథానాయికగా   నటించింది. ఏప్రిల్‌ 2న తెలుగు, తమిళ భాషల్లో ఏకాలంలో   విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను విలేకర్లతో పంచుకున్నారు దర్శకుడు బక్కియరాజ్‌.

* పూర్తి గ్రామీణ నేపథ్య కథతో రూపొందిన చిత్రమిది. తన స్వభావానికి ఏమాత్రం సంబంధం లేని వందమందితో కథానాయకుడు ఎలాంటి ప్రయాణం చేశాడన్నదే ఈ చిత్ర కథ.

* ఈ క్రమంలో ఆయనకి ఎదురైన సవాళ్లేంటి, వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆ వందమందికీ ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? అన్నది ఆసక్తికరాంశం. ఈ కథ తమిళంలో సేలంలో జరిగినట్లు చూపిస్తుండగా.. తెలుగులో అమరావతిలోని ఓ   పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంటుంది.

* ఈ చిత్రంలో కార్తి రోబోటిక్స్‌ ఇంజినీర్‌గా కనిపిస్తారు. ముంబయిలో ఉండే ఆయన ఓ చిన్న పల్లెటూరికి ఎందుకొస్తారు, ఆ ఊరి కోసం ఆయన చేసిన త్యాగం ఏమిటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

* సాధారణంగా కార్తి బౌండ్‌ స్క్రిప్ట్‌ వినకుండా ఏ నిర్ణయం తీసుకోరు. కానీ, నేను ఇరవై నిమిషాలు కథ వినిపించగానే.. ‘నేను చేస్తున్నా’ అని మాటిచ్చారు. అదే నా తొలి విజయం అనుకున్నా.

* ఈ చిత్రంతో రష్మిక తమిళ ప్రేక్షకులకు పరిచయమవుతుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో రష్మికకి వ్యవసాయ నేపథ్యంలో కొన్ని సీన్లు ఉన్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

* ఇందులో చాలా మంది ప్రతినాయకులు ఉంటారు. అందులో అసలు విలన్‌ ఎవరనేది ప్రేక్షకులకి పజిల్‌.

* అవకాశం వస్తే తెలుగులోనూ సినిమా చేయాలని ఉంది. పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లతో సినిమా చేయాలనుకుంటున్నా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని