మహాభారతం యుద్ధం లేకుండా... - karthi sulthan telugu movie teaser
close
Updated : 01/02/2021 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహాభారతం యుద్ధం లేకుండా...

కార్తి ‘సుల్తాన్‌’ టీజర్‌ చూశారా?

హైదరాబాద్‌: ‘మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే, అదే మహాభారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి సర్‌’ అంటున్నారు కార్తి. ఆయన కథానాయకుడిగా బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుల్తాన్‌’. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

ఈ సందర్భంగా ‘సుల్తాన్‌’ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు? మరి ఈ కలియుగ మహాభారతంలో కృష్ణుడు ఎవరి పక్షాన నిలబడ్డాడు?తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఏప్రిల్‌ 2 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్రీమ్‌ వారియర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. వివేక్‌ మెర్విన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని