వినూత్నంగా ‘చావు కబురు చల్లగా’ ప్రచారం - karthikyea promotions for chavu kaburu challaga
close
Published : 16/03/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వినూత్నంగా ‘చావు కబురు చల్లగా’ ప్రచారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్య త్రిపాఠి కథానాయిక. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వినూత్న ప్రచారాన్ని మొదలుపెట్టాడు కార్తికేయ. నటుడు ‘రంగస్థలం’ మహేశ్‌తో కలసి హైదరబాద్‌లో సందడి చేశారు. స్వయంగా కార్తికేయనే సినిమా వాల్‌ పోస్టర్‌ అంటించి, రైతు బజార్‌లో వ్యాపారులతో ముచ్చటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘మార్చి 19న మీ బస్తీ బాలరాజ్‌ వస్తున్నాడు.. మీ అభిమాన థియేటర్లలో’ అని మహేశ్‌ చెప్పే తీరు ఆకట్టుకుంటుంది. ‘ప్రేక్షకులంతా చావు కబురు చల్లగా సినిమా చూసి  మీ బాలరాజ్‌ని, సినిమాకు పనిచేసిన అందర్నీ ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు కార్తికేయ.

అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్‌బిజోయ్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని