close

తాజా వార్తలు

రజనీ చిత్రంలో కీర్తిసురేష్‌

రజనీ కాంత్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: మునుపటికన్నా మరింత జోరును కనబరుస్తున్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ‘కబాలి’, ‘కాలా’, ‘పేట’ చిత్రాల తర్వాత ఇప్పుడు ‘దర్బార్‌’గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు తదుపరి సినిమాకు కూడా సిద్ధమయ్యారు. రజనీకాంత్‌ నటిస్తున్న ఈ 168వ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఇందులో రజనీకాంత్‌తో కలిసి నటించనుంది కీర్తిసురేష్‌. ఆమె తొలిసారిగా రజనీ చిత్రంలో నటిస్తుండటం విశేషం. సూపర్‌స్టార్‌ చిత్రంలో నటించాలని పలువురు హీరోయిన్లు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ అవకాశం కీర్తిని వరించింది. అంతేకాకుండా రజనీకాంత్‌కు జోడీగా ఖుష్బూ, మీనా పేర్లు వినిపించాయి. కానీ చివరగా కీర్తి పేరును ప్రకటించారు. ఇందులో ఆమె పాత్ర ఏంటనేది ఇంకా ఖరారు చేయలేదు. ఈ విషయమై కీర్తి స్పందిస్తూ.. ‘‘ నేను రజనీకాంత్‌కు అతిపెద్ద అభిమానిని. ఆయన చిత్రంలో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉందని’’ పేర్కొంది. 

కీర్తిసురేష్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.