7000 బెడ్లను కేటాయించండి: కేజ్రీవాల్‌ - kejriwal writes to pm modi seeking help for beds in delhi
close
Published : 18/04/2021 23:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

7000 బెడ్లను కేటాయించండి: కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడిన వారికి ఆస్పత్రుల్లో పడకలు సమకూర్చడం కూడా  కష్టమవుతోందన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు.  దిల్లీలోని ఆస్పత్రుల్లో కనీసం 7,000 బెడ్లను కరోనా బాధితుల కోసం కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కరోనా బాధితుల కోసం కేవలం 100 ఐసీయూ బెడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. వివిధ ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితుల కోసం కేటాయించిన బెడ్లు ఎప్పటికప్పుడు నిండిపోతున్నాయని, పాజిటివిటీ కూడా 24 శాతం నుంచి 30 శాతానికి పెరిగిందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

ప్రస్తుతం దిల్లీలోని మొత్తం 10,000 ఆస్పత్రులకుగానూ 1,800 ఆస్పత్రులను కొవిడ్‌ బాధితుల కోసం వినియోగిస్తున్నారు. దీనిని 7000కు పెంచాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్‌ ప్రధానికి లేఖ రాశారు. అంతకుముందు ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజలతో మాట్లాడారు. పరిస్థితులు ఆందోళన కరంగా మారుతున్నప్పటికీ భయపడవద్దని సూచించారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో నగరంలోని ఆస్పత్రులపై ఒత్తిడి ఎక్కువైందని అన్నారు. ఇలాంటి కీలక సమయంలో సదుపాయాలు కల్పించడంతో కేంద్రం ప్రభుత్వం సహకరించాలని కోరారు. కేసుల సంఖ్య పెరగడంతో ప్రత్యేకంగా కొవిడ్‌ ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని