ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ఇవ్వలేం: విజయన్‌ - kerala needs more oxygen cant give other states says pinarayi vijayan
close
Published : 11/05/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ ఇవ్వలేం: విజయన్‌

తిరువనంతపురం: దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న తరుణంలో కేరళ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయలేమని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈమేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని ఆక్సిజన్‌ నిల్వలను ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేశామని, ప్రస్తుతం 86 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఆక్సిజన్‌ కేటాయింపులపై మే 6న కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇవాళ్టి వరకు రోజుకు 40 మెట్రిక్‌ టన్నుల చొప్పున సరఫరా చేశామని అన్నారు. అయితే, కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడం, మరోవైపు ఆక్సిజన్‌ నిల్వలు తగ్గిపోతుండటం వల్ల ఇకపై సరఫరా చేయడం సాధ్యం కాదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ కేరళలో ప్రస్తుతం 4,02,640 క్రియాశీల కేసులు ఉన్నాయి. మే 15 నాటికి  6 లక్షలు దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ  లెక్కన మే 15 నాటికి 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుంది’’అని పినరయి తన లేఖలో పేర్కొన్నారు. 

రాష్ట్రంలోని అన్ని ప్లాంట్లలో కలిసి 219 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను  ఉత్పత్తి చేసే సామర్థ్యముందని సీఎం పినరయి విజయన్‌ చెప్పారు. అత్యధికంగా పాలక్కాడ్‌లోని ఐనాక్స్‌ ప్లాంట్‌లో 150 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రధాన ప్లాంట్లలోని ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు తరలించడం భౌగోళికంగా కష్టమవుతోందని, అందువల్ల కేరళలో ఉత్పత్త చేసిన ప్రాణవాయువు రాష్ట్రానికే కేటాయించాలని పినరయి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి మరిన్ని క్రయోజనిక్‌ ట్యాంకర్లు కేటాయించాలన్నారు. కరోనా రెండోదశ వ్యాప్తి కేరళలోనూ ఉద్ధృతంగా కనిపిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. పాజిటివిటీ రేటు 28.88గా నమోదవుతుండగా.. ఇప్పటివరకు కేవలం 17.38 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని