‘కేజీయఫ్‌2’ విడుదలయ్యేది ఆ రోజే - kgf chapter2 release date announced
close
Updated : 29/01/2021 19:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేజీయఫ్‌2’ విడుదలయ్యేది ఆ రోజే

హైదరాబాద్‌: టీజర్‌తోనే భారతీయ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన చిత్రం ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’‌. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. యావత్‌ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది.  జులై 16వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.

దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’ విడుదల కానుంది.

చాప్టర్‌-1లో మిగిలిన అనేక ప్రశ్నలకు ఇందులో సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీయఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీయఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్‌ ప్రకారం చనిపోయిన అధీర ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్‌ ఖలీ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? వంటివి తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని